పాకిస్తాన్ లో హంగ్..ఇమ్రాన్ హవా
63 స్థానాలతో నవాజ్ షరీఫ్ పార్టీ
పాకిస్తాన్ – పాకిస్తాన్ లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. విచిత్రం ఏమిటంటే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టలేదు ఆ దేశ ప్రజలు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం 113 సీట్లు రావాల్సి ఉండగా ఏ పార్టీకి పూర్తి ఫిగర్ రాలేదు.
అవినీతి ఆరోపణలతో జైలు పాలైన మాజీ ప్రధాన మంత్రి , మాజీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్లు భారీ ఎత్తున విజయం సాధించడం విశేషం. 92 మంది ఇమ్రాన్ మద్దతు దారులు గెలుపొందడం విశేషం. పవర్ లోకి రావాలంటే ఇంకా 21 సీట్లు కావాల్సి ఉంది.
మరో వైపు మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కు చెందిన పార్టీకి 63 స్థానాలు దక్కగా బిలావర్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి 50 స్థానాలు లభించాయి. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ ఓటర్ల తీర్పుపై స్పందించారు. ప్రజలు విజ్ఞతతో తీర్పు చెప్పారని కితాబు ఇచ్చారు.
మాజీ ప్రధానులు షరీఫ్ , ఇమ్రాన్ ఖాన్ లు గెలుపొందడం విస్తు పోయేలా చేసింది. అయితే ఇంకా దేశ ఎన్నికల సంఘం తుది ఫలితాలను ప్రకటించక పోవడంతో ఇంకా ఉత్కంఠ నెలకొంది.