కప్ రేసులో భారత క్రికెట్ జట్టు
అమెరికా – ఐసీసీ ఆధ్‌వర్యంలో అమెరికా, విండీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్ నుంచి అనూహ్యంగా అత్యంత బలమైన జట్టుగా పేరు పొందిన బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది పాకిస్తాన్ ప్రేమికులకు బిగ్ షాక్ అని చెప్పక తప్పదు.
ఫ్లోరిడాలో భారీ ఎత్తున వర్షాలు కురవడంతో పాటు వరదలు రావడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఐర్లాండ్ – యుఎస్ఏ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాకిస్తాన్ తప్పని పరిస్థితుల్లో వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్ -4 కు చేరుకోవడానికి అర్హత సాధించ లేక పోయింది.
ఇక మ్యాచ్ రద్దు కావడంతో అమెరికా, ఐర్లాండ్ జట్లకు చెరో పాయింట్ లభించింది. టేబుల్ టాపర్ గా గ్రూప్ -ఏలో భారత్ కొనసాగుతోంది. ఇక టి20 టోర్నీలో పేలవమైన ప్రదర్శన కూడా కొంప ముంచేలా చేసింది. ప్రధానంగా ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన హోరా హోరీ పోరులో చేతులెత్తేసింది పాకిస్తాన్.