Wednesday, April 2, 2025
HomeNEWSINTERNATIONALపాకిస్తాన్ ట్రైన్ హైజాక్ లో మిలిటెంట్లు ఖ‌తం

పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ లో మిలిటెంట్లు ఖ‌తం

ప్ర‌క‌టించిన పాకిస్తాన్ నేష‌న‌ల్ ఆర్మీ

పాకిస్తాన్ – పాకిస్తాన్ ఆర్మీ జ‌న‌ర‌ల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రైలు హైజాక్ ఘ‌ట‌న‌కు సంబంధించి 21 మంది ప్ర‌యాణీకుల‌తో పాటు న‌లుగురు పారా మిల‌ట‌రీ సైనికులు మృతి చెందార‌ని వెల్ల‌డించింది. పాకిస్తాన్ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిగిన కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా 8వ టన్నెల్ వద్ద రైలును ఆపేసి, ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు బ‌లూచిస్తాన్ మిలిటెంట్స్ ఆర్మీ. దీనిపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేసింది పాకిస్తాన్ ఆర్మీ.

ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బ‌లూచిస్తాన్ ప్రాంతంలో 400 మందికి పైగా ప్ర‌యాణీకుల‌తో వెళుతున్న రైలును సాయుధ తిరుగుబాటుదారులు అడ్డుకున్నారు. హైజాక్ కు పాల్ప‌డ్డారు. 155 మంది బందీల‌ను విడిపించారు. ఇందులో 58 మంది పురుషులు , 31 మంది మ‌హిళ‌లు , 15 మంది చిన్నారులు ఉన్నారు. స‌మీపంలోని మాక్ ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. అక్క‌డ తాత్కాలికంగా ఆస్ప‌త్రిని ఏర్పాటు చేశారు. క్వెట్టా నుండి పెషావ‌ర్ కు వెళ్లే మార్గంలో మారుమూల ప్రాంతంలోని సొరంగంలో జాఫ‌ర్ ఎక్స్ ప్రెస్ ను మిలిటెంట్లు అడ్డుకున్నారు. ఈ మార్గం నెల రోజుల త‌ర్వాత తిరిగి ప్రారంభించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments