INTERNATIONALNEWS

డొనాల్డ్ ట్రంప్ నా తండ్రి – పాక్ యువ‌తి

Share it with your family & friends

త‌న‌ను ప‌ట్టించు కోలేద‌ని ఆరోప‌ణ

పాకిస్తాన్ – అమెరికా దేశ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీ సాధించి ఆ దేశానికి 47వ అధ్య‌క్షుడిగా త్వ‌ర‌లో ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దం అయ్యాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆయ‌న‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది.

పాకిస్తాన్ కు చెందిన ముస్లిం యువ‌తి త‌న తండ్రి డొనాల్డ్ ట్రంప్ అని, త‌న‌ను ప‌ట్టించు కోవ‌డం లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. స‌ద‌రు యువ‌తి చేసిన కామెంట్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ట్రంప్ త‌న తండ్రి అనేందుకు త‌న వ‌ద్ద త‌గిన‌న్ని ఆధారాలు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి మీడియా సాక్షిగా ముందుకు రావ‌డం, ఆరోప‌ణ‌లు చేయ‌డం విస్తు పోయేలా చేసింది. ఈ సంద‌ర్బంగా ముస్లిం యువ‌తి మాట్లాడుతూ ట్రంప్ త‌న తండ్రి అని, త‌న‌ను ఎవ‌రూ అనుమానించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పింది.

తాను ముస్లిం, పంజాబీ అని, త‌న తండ్రి ట్రంప్ అంటూ ఉర్దూలో చెప్పింది ముస్లిం పాకిస్తాన్ యువ‌తి. త‌న స‌వతి త‌ల్లి మెలానియా త‌న ప‌ట్ల స‌రిగా ప్ర‌వ‌ర్తించ లేద‌ని, అందుకే జీవ సంబంధ‌మైన త‌ల్లి త‌న‌ను పాకిస్తాన్ కు తిరిగి తీసుకు వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని కూడా కోరింది.