గులాబీల గొంతు నొక్కలేరు
పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. బుధవారం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అంతకు ముందు సీఎం కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పట్ల వ్యక్తిగత దూషణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఇది అసెంబ్లీనేనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. వెంటనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.
కడియం ఎక్కడా బడ్జెట్ కు సంబంధం లేకుండా మాట్లాడ లేదని అన్నారు. ప్రభుత్వానికి నిజాలను ప్రశ్నిస్తే సహించడం లేదన్నారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి నోరు జారడం మంచి పద్దతి కాదన్నారు. ఎవరి మీదనో కోపం పెట్టుకుని తమను టార్గెట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
తాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తెలంగాణ భాష ఇదే అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజల భాషను కావాలని అవమానిస్తున్నారంటూ వాపోయారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు కోవాలని కోరారు.