NEWSTELANGANA

అనురాగ్ సంస్థ‌లు బ‌ఫ‌ర్ జోన్ లో లేవు

Share it with your family & friends

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి
హైద‌రాబాద్ – అనురాగ్ సంస్థ‌ల చైర్మ‌న్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న త‌న సంస్థ‌ల‌కు సంబంధించి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు . అనురాగ్ సంస్థ‌లు బ‌ఫ‌ర్ జోన్ లో నిర్మాణాలు చేప‌ట్టాయ‌ని నీటి పారుద‌ల శాఖ అధికారులు త‌మ‌పై కేసు న‌మోదు చేశార‌ని తెలిపారు. ఇది పూర్తిగా విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి.

నీటి పారుదలశాఖ 2017 లో NOC ఇచ్చిందని స్ప‌ష్టం చేశారు. కలెక్టర్ NOC ఇచ్చిన విష‌యం గుర్తు చేశారు. త‌మ‌కు సంబంధించిన భూమి FTL లో కాని , Buffer Zone లో కాని లేదని అన్ని సంబంధిత శాఖ‌లు ఇచ్చిన‌ట్లు తెలిపారు.

HMDA అనుమతులు తీసుకొని మాత్రమే మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి. అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. అన్ని అనుమతులు, NOC లు ఇచ్చిన అధికారులే ప్ర‌భుత్వం ఒత్తిడితో కేసులు పెడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌న భూమికి సంబంధించి, నిర్మాణాల‌కు సంబంధించి అన్ని అనుమ‌తులు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని పేర్కొన్నారు. నోటీసు ఇవ్వకుండా, మా వివరణ తీసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయవద్దని కోరారు.

హాస్పిటల్ లో పేద రోగుల సేవలను ఆప వ‌ద్ద‌ని సూచించారు. రాజకీయ కక్ష‌ల‌కు విద్యాసంస్థలు, హాస్పిటల్స్ కేంద్రాలు కారాదని పేర్కొన్నారు. గౌరవ హైకోర్టును కూడా వేడుకుంటున్నానని తెలిపారు. మాకు నోటీసులు ఇవ్వమనండి. మా అనుమతులను పరిశీలించమనండి. అనుమతులు లేకపోతె తదనంతరం చర్యలు తీసుకోమని కోరుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి.