పల్లా..రాకేశ్ రెడ్డిల అరెస్ట్
నిరుద్యోగుల తరపున పోరాటం
హైదరాబాద్ – తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆస్పత్రిలో నిరాహారదీక్ష చేపట్టారు విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయకుడు. సోమవారం ఆయనను పరామర్శించేందుకు వెళ్లారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దాడి చేసేందుకు ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
బలవంతంగా ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనం లో తరలించారు. ఏనుగుల రాకేష్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్ కు, ఎమ్మేల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ని చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరితో పాటు మరో 50 మంది బీఆర్ఎస్ వీ నాయకులను, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ప్రభుత్వ తీరుపై, పోలీస్ ల అత్యుత్సాహం పై మండిపడ్డారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకున్ని పరామర్శించే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించారు. ప్రజా పాలన అంటే ఇదేనా ? మూడు రోజులు మురిపించి ఇచ్చిన హామీలు మరిచి సిఎం, మంత్రులు ఢిల్లీ టూర్లు, పదవుల పంపకాలలో ప్రయివేటు కార్యక్రమాలతో ఊరేగుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.