NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే – ప‌ల్లా

Share it with your family & friends

టీడీపీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస రావు

అమ‌రావ‌తి – వైసీపీ బాస్ , మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలు త‌ప్పా నిజాలు కావంటూ మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ ఏపీ చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ చీఫ్, సీఎం చంద్ర‌బాబు నాయుడు గురించి జ‌గ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్ లో ఎలాంటి నిజం లేద‌న్నారు.

ఆత్మ విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం మానుకుని ఎదురు దాడి చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. వ్యవస్థీకృత నేర రాజకీయాలు చేయ‌డం జ‌గ‌న్ రెడ్డికి అల‌వాటుగా మారింద‌న్నారు. గ‌త 5 ఏళ్ల‌లో ఏపీని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఆరోపించారు.

2004లో 2 కోట్లలోపు ఆస్తి ఉన్న జగన్ నేడు లక్షల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌న తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకున్నాడ‌ని, ఆయ‌న చ‌రిత్ర ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు.

చట్టబద్ద వ్యాపారం, పాలన చేసే చంద్రబాబుకు వ్యవస్థీకృత నేర రాజకీయాల అవసరం ఏముందంటూ ప్ర‌శ్నించారు. ఉచ్చ నీచాలు మరచి మహిళల శీల హననం చేసే అపర దుశ్శాసనుల భరతం పట్టడం స్వీవస్థీకృత నేరమా? అని నిల‌దీశారు.

తన దుష్ట లక్షణాల్ని ఎదుటి వారికి అంట గట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్ నైజం అన్నారు. మీ కుటుంబం దోపిడీ ఆస్తుల పంపకం బజారున పడింది అందుకే కదా? దీన్ని డైవర్షన్ చేయడానికి చివరకు తల్లి, చెల్లి శీలహననానికి బరి తెగిచింది నువ్వు కాదా అని మండిప‌డ్డారు.