NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ప‌ల్లా భేటీ

Share it with your family & friends

ఆహ్వానించిన జ‌న‌సేన పార్టీ చీఫ్

అమ‌రావ‌తి – ఏపీ తెలుగుదేశం పార్టీ చీఫ్ గా కొత్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు ఆదివారం ప‌వ‌న్ క‌ల్యాణ్ ను త‌న నివాసంలో క‌లుసుకున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య చాలా సేపు చ‌ర్చ‌లు జ‌రిగాయి. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆహ్వానం మేర‌కు టీడీపీ చీఫ్ భేటీ అయిన‌ట్లు స‌మాచారం.

ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య దాదాపు గంట‌ర‌న్న‌ర‌కు పైగా స‌మ‌యం ప‌ట్టింది. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. దీంతో ఇటు టీడీపీ అటు జ‌న‌సేన పార్టీల మధ్య స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం అత్యంత ముఖ్య‌మ‌ని ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం.

రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీ నేతల నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు కూట‌మికి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌వ‌ర్తించాల‌ని ఎక్క‌డా పొర‌పొచ్చాలు లేకుండా చూసుకోవాల‌ని సూచించారు.

జన సైనికులు క్షేత్ర స్థాయిలో చూపించిన ఉత్సాహం, తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమిష్టి కృషి,
భారతీయ జనతా పార్టీ అభిమానుల ఆదరణ సమిష్టిగా రాష్ట్ర ఓటర్ల తీర్పులో ప్రతిబింబించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇలాగే మైత్రీ బంధం కొన‌సాగాల‌ని కోరారు.