DEVOTIONAL

అంగ‌రంగ వైభోగం పల్లవోత్సవం

Share it with your family & friends

త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు

తిరుమల – తిరుమలలో టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన పల్లవోత్సవం అంగ‌రంగ వైభ‌వోపేతంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని ప్ర‌తి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. మైసూర్‌ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మ వార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఇదిలా ఉండ‌గా ఈ అద్భుత‌మైన కార్య‌క్ర‌మానికి భారీ ఎత్తున భ‌క్తులు హాజ‌రు కావ‌డం విశేషం. తిరుమ‌ల ప్రాంగ‌ణ‌మంతా గోవిందా గోవిందా , ఆప‌ద మొక్కుల వాడా గోవిందా..అనాధ ర‌క్ష‌క గోవిందా అంటూ భ‌క్తులు స్వామి వారిని స్మ‌రించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పెష్కర్ శ్రీహరి, పడి కావలి ఏఈఓ మోహన్ రాజు, ఇతర అధికారులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు పాల్గొన్నారు.