ఆ టాబ్లెట్స్ వాడితే ప్రమాదం
హెచ్చరించిన టీడీఏబీ
ఢిల్లీ – డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు (డీటీఏబి) సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మందుల మాఫియా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏయే మందులు వాడాలనే దానిపై కేంద్ర సర్కార్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తాజాగా కేంద్రం ప్రకటించిన మందులలో 156 ట్యాబ్లెట్స్ అత్యంత ప్రమాదకరమైనవని పేర్కొంది. ప్రజలు ఎవరూ వాటిని వాడ కూడదని సూచించింది. విచిత్రం ఏమిటంటే వాడ కూడదని హెచ్చరించిన మందులను రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తుండడం విశేషం.
వాటిపై నియంత్రణ అన్నది లేకుండా పోయిందన్న ఆరోపణలు లేక పోలేదు. కాగా నిషేధించిన కాంబినేషన్ డ్రగ్స్ లో పారాసెటమాల్ , సెటీరిజైన్ ఉన్నాయి. నిత్యం జ్వరం , జలుబు, అలర్జీ (దురద) వచ్చే రోగులకు వీటిని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. వీటిని డాక్టర్లు కూడా రాస్తుండడం విస్తు పోయేలా చేస్తోంది.
ఈ మందులతో పాటు 34 మల్టీ విటమిన్లు కూడా నిషేధించిన జాబితాలో ఉన్నాయంటూ కేంద్రం హెచ్చరించింది.
“వాటిలో ఉన్న పదార్ధాలకు చికిత్సా పరమైన సమర్థన లేదు, అవి మానవులకు ప్రమాదాన్ని కలిగిస్తాయి” డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు పేర్కొంది.