NEWSANDHRA PRADESH

మోదీ విధానం దేశానికి ప్ర‌మాదం

Share it with your family & friends

ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్

అమ‌రావ‌తి – కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త ప్ర‌ముఖ విశ్లేష‌కుడు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జాతీయ మీడియాతో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్బంగా కేంద్రంలో కొలువు తీరిన న‌రేంద్ర మోదీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంతరించుకుంది. ఇదే విష‌యాన్ని పంచుకున్నారు కాంగ్రెస్ సోష‌ల్ మీడియా ఇంఛార్జ్ సుప్రియా షినాటే.

ఈ సంద‌ర్బంగా ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ఏమ‌న్నారంటే ఆర్థిక ప‌రంగా క‌నీసం 20 నుంచి 25 ఏళ్లు భార‌త దేశాన్ని మోదీ వెన‌క్కి నెట్టి వేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ ప‌రంగా చూస్తే మ‌న‌ల్ని స్వాతంత్రానికి పూర్వపు స్థితిలోకి తీసుకు వెళ్లేలా చేశారంటూ వాపోయారు .

సామాజిక నిర్మాణం, శాస్త్రీయ దృక్పథం, సమాజానికి సంబంధించిన విలువల పరంగా ప్ర‌ధాన‌మంత్రి మనల్ని మధ్య యుగాలకు తీసుకు వెళ్లాడంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్ర‌భుత్వం గ‌నుక మ‌రోసారి దేశంలో కొలువు తీరిన‌ట్ల‌యితే అత్యంత ప్ర‌మాదమ‌ని హెచ్చ‌రించారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్.

మోదీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల పాలిట శాపంగా మార‌నున్నాయ‌ని , మేలుకోక పోతే ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌న్నారు. గ‌త కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ కూడా ఇదే స్థాయిలో మొత్తుకుంటూ వ‌స్తున్నారు. కానీ జ‌నం విన‌డం లేదు.