ఓటు వేయని వారిని శిక్షించాలి
నటుడు పరేష్ రావల్ కామెంట్స్
ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లైన్ లో నిల్చుని సాధారణ వ్యక్తిగా తన విలువైన ఓటు తనకు నచ్చిన నాయకుడికి వేశారు.
అనంతరం పరేష్ రావెల్ మీడియాతో మాట్లాడారు. ఓటు ప్రతి భారతీయుడి హక్కు. అది రాజ్యాంగం కల్పించింది. దానిని మనం గుర్తించకుండా ఓటు హక్కు వినియోగించు కోక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఓటు వేయని వారికి ప్రభుత్వాన్ని, నాయకులను ప్రశ్నించే అధికారం లేదన్నారు. ఎవరైనా సరే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు విలువైన ఓటు వేయాలని పిలుపునిచ్చారు. లేకపోతే ప్రజాస్వామ్యానికి విలువ అనేది ఉండదన్నారు .
ఓటు వేయని వారిని గుర్తించి, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పరేష్ రావల్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారాయి. బ్యాంకుకు పాన్ కార్డు, ఆధార్ కార్డును ఎలా అనుసంధానం చేశారో ఓటును కూడా జత పర్చాలని సూచించారు.