SPORTS

ఫైన‌ల్స్ కు చేరిన గోల్డెన్ బాయ్ నీర‌జ్ చోప్రా

Share it with your family & friends

పారిస్ ఒలింపిక్స్ 2024లో సూప‌ర్ షోతో వైర‌ల్

ఫ్రాన్స్ – పారిస్ వేదిక‌గా జ‌రుగుతున్న ఒలింపిక్స్ 2024 పోటీల్లో భార‌త దేశానికి గోల్డెన్ బాయ్ నీర‌జ్ చోప్రా అరుదైన ఘ‌న‌త సాధించాడు. 89.34 మీట‌ర్ల పురుషుల జావెలిన్ త్రోతో ఫైన‌ల్స్ లోకి నేరుగా ప్ర‌వేశించాడు. చోప్రా త‌న తొలి ప్ర‌య‌త్నంలోనే 84 మీట‌ర్ల ఆటోమేటిక్ క్వాలిఫైయింగ్ మార్కును అధిగ‌మించ‌డం విశేషం.

త‌న వ్య‌క్తిగ‌త అత్యుత్త‌మ ర్యాంక్ ను పొందాడు. మ‌రో వైపు రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ సూప‌ర్ షోతో ఆక‌ట్టుకున్నాడు. నాలుగు సార్లు ప్ర‌పంచ ఛాంపియ‌న్ అయిన యుయి సుసాకిపై గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేశాడు.

ఇదిలా ఉండ‌గా నీర‌జ్ చోప్రా క్వాలిఫికేష‌న్ రౌండ్ లో అత‌ని ప్ర‌ద‌ర్శ‌న ఫైన‌ల్స్ కు చేరుకునేలా చేయ‌డంత ఓపాటు మ‌రో బంగారు ప‌త‌కానికి బ‌ల‌మైన పోటీదారుగా నిలిచేలా చేసింది.

కాగా 2020లో టోక్యోలో జ‌రిగిన ఒలింపిక్స్ లో 87.58 మీట‌ర్ల త్రోతో స్వ‌ర్ణం సాధించాడు. రాబోయే ఫైన‌ల్స్ పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. నీర‌జ్ చోప్రా ఫైన‌ల్ కు చేరడం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంతోషం వ్య‌క్తం చేశారు.