పెద్ద దిక్కును కోల్పోయాం
పరిటాల సునీత..శ్రీరామ్
హైదరాబాద్ – ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్. శనివారం ఆయన మృతి చెందారన్న వార్త తెలిసిన వెంటనే హుటా హుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. రామోజీరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంరతం పరిటాల సునీత, శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. రామోజీరావు లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతున్నామని వాపోయారు. ఒక రకంగా పరిటాల రవి చని పోయిన తర్వాత తమకు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారని తెలిపారు. ఇవాళ రామోజీరావును కోల్పోవడం తెలుగు వారికే కాకుండా తమకు పెద్ద నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనాడు పత్రిక ద్వారా కోట్లాది మందిని ప్రభావితం చేశారని, రాజకీయాల పరంగా తమకు వెన్ను దన్నుగా నిలుస్తూ అవసరమైన సమయంలో సలహాలు , సూచనలు అందజేస్తూ వచ్చారని కొనియాడారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్.