టీడీపీ గెలుపే తమ లక్ష్యం
పరిటాల సునీత కామెంట్
అనంతపురం జిల్లా – మాజీ మంత్రి పరిటాల సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎవరు చేరినా తమకు అభ్యంతరం లేదన్నారు. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. రాజకీయాలలో ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయని ఇందులో తప్పు పట్టేందుకు ఏమీ లేదన్నారు.
తమ కుటుంబం త్యాగాలను చేసిందన్నారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. పరిటాల రవి ఇవాళ భౌతికంగా లేక పోయినా ఆయనను ప్రేమించే మనుషులు ఇంకా ఉన్నారని పేర్కొన్నారు.
తమ లక్ష్యం ఒక్కటేనని నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావడమేనని స్పష్టం చేశారు.
తనకు రాప్తాడు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియ చేశారు పరిటాల సునీత. ముందు నుంచీ కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చామని , చిల్లర రాజకీయాలు ఏనాడూ చేయలేదన్నారు.
పది మందికి అన్నం పెట్టడమే కానీ ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవన్నారు పరిటాల సునీత. ప్రజలు తమను తప్పకుండా ఈసారి ఆశీర్వదిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు .