పరిటాల కుటుంబానికి దక్కని చోటు
చంద్రబాబుపై సీనియర్లు గుస్సా
అమరావతి – ఏపీలో కొత్తగా కొలువు తీరనున్న మంత్రివర్గంలో సీనియర్లకు చోటు దక్కక పోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ముందు నుంచీ పార్టీని నమ్ముకుని పని చేస్తూ వచ్చారు. తాజాగా ప్రకటించిన కేబినెట్ జాబితాను చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
తన నివాసంలో జనసేన, బీజేపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక ములాఖత్ లో కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, జేపీ నడ్డాతో పాటు పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. అర్ధరాత్రి లిస్టును ఖరారు చేశారు. బుధవారం తెల్లవారుజామున ప్రకటించారు.
దీంతో తమకు చోటు దక్కుతుందని ఆశించిన సీనియర్లు ఖంగుతిన్నారు. వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతి నేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్ , నందమూరి బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ , జీవీ ఆంజనేయులు, కూన రవి తదితరులు ఉన్నారు.
అలాగే వీరితో పాటC అస్మిత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి కొండ్రు మురళీతో పాటు రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకూ చోటు దక్క లేదు.