మాజీ మంత్రి పరిటాల సునీత ఫైర్
అనంతపురం జిల్లా – మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. తన భర్త, మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్ర దారుణ హత్య వెనుక తన పాత్ర ఉందంటూ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా విచారించిందన్నారు. టీవీ బాంబ్ గురించి మాట్లాడుతున్న తోపుదుర్తి చందు ..కారు బాంబు గురించి కూడా మాట్లాడాలన్నారు. సూట్ కేస్ బాంబు ఎవరు పెట్టారో కూడా చెప్పాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.
పరిటాల సునీత మీడియాతో మాట్లాడారు. ఆమె తాజాగా చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇదిలా ఉండగా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన చిన్న ఘటనను ఫ్యాక్షన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరు ఏమిటనేది ప్రజలకు తెలుసన్నారు. ఫ్యాక్షన్ కారణంగా పరిటాల, గంగుల కుటుంబాలు తీవ్రంగా నష్ట పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు సునీత. ప్రశాంతంగా ఉన్న సమయంలో గంగుల భానుమతి, సానే ఉమ కుటుంబాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.