పార్లమెంట్ ను కుదిపేసిన అదానీ అంశం
సోమవారానికి ఉభయ సభలు వాయిదా
ఢిల్లీ – గౌతమ్ అదానీకి సంబంధించిన అంశం మరోసారి పార్లమెంట్ ను కుదిపేసింది. వరుసగా నాలుగో రోజు అదానీ గ్రూప్ అవినీతిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది.
అదానీ అంశంపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తిర్మనాలను తిరస్కరించారు లోక్ సభ, రాజ్యసభ సభాపతులు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విపక్ష నేతలు. పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
ఓ వైపు అమెరికా తనపై తీవ్ర ఆరోపణలు చేసినా, ఆధారాలతో సహా బయట పెట్టినా ఎందుకు అదానీపై చర్చకు సమ్మతించడం లేదంటూ నిలదీశారు సభ్యులు. కావాలని అదానీని కేంద్ర సర్కార్ వెనకేసుకు వస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
చివరకు దేశాన్ని సైతం మొత్తం అదానీకి అమ్మేస్తారా అని మండిపడ్డారు ఖర్గే. దీనిపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టుపట్టారు. దీంతో సభలు సజావుగా సాగడం లేదంటూ సభాపతులు సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.