ప్రోగ్రెసివ్ ప్యానల్ కు పాశం కంగ్రాట్స్
డిసెంబర్ 18న జరగనున్న ఎన్నికలు
హైదరాబాద్ లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో కంటే ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. మూడు నుంచి నాలుగు లేదా ఐదు ప్యానెళ్లు పోటీలో ఉండనున్నాయి. ఇవాళ బరిలోకి దిగిన ప్రోగ్రెసివ్ టీమ్ తమకు మద్దతు ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిని కలిశారు.
ఈ సందర్బంగా సదరు ప్యానెల్ సభ్యులను అభినందించారు. ఇదిలా ఉండగా ఎన్నికలు డిసెంబర్ 18న హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో జరగనున్నాయి. ఈనెల 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు కోఆపరేటివ్ రిజిస్ట్రార్. 12న నామినేషన్లు ఉపసహరణకు గడువు విధించారు.
హౌసింగ్ సొసైటీ స్థలాల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఓ వైపు రాష్ట్ర సర్కార్ ఆశలు కల్పిస్తున్నా మరో వైపు చాలా మంది సీనియర్ జర్నలిస్టులకు స్థలం అనేది ఎండమావిగా మారింది. దీంతో పని చేసే వారికి, స్థలాలను సాధించే వారికి మాత్రమే మద్దతు ఇవ్వాలని ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ ప్యానల్ కోరుతోంది. జర్నలిస్టులను కలిసి విన్నవిస్తోంది. మొత్తంగా 18న ఎవరి ప్యానెల్ విజయ కేతనం ఎగుర వేస్తోందనని ఉత్కంఠ నెలకొంది.