సన్ రైజర్స్ స్కిప్పర్ ప్యాట్ కమిన్స్
హైదరాబాద్ – ఐపీఎల్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ లు కన్ ఫర్మ్ అయ్యాయి. ఇక మిగిలింది ఫైనల్ కు ఎవరు చేరుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి కోల్ కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అనూహ్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఇక ఎవరూ ఊహించని రీతిలో దుమ్ము రేపింది ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్. గత సీజన్ లో తీవ్ర నిరాశకు గురి చేసిన ఆ టీమ్ ఇప్పుడు అద్భుతంగా ఆడుతోంది. ఎవరూ ఊహించని రీతిలో సత్తా చాటుతోంది.
ఈ సందర్బంగా జట్టు కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో దుమ్ము రేపుతోందన్నాడు. దీనికి ప్రధానంగా ట్రావిస్ హెడ్ , అబిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డిలు కీలకంగా ఆడడమేనని పేర్కొన్నాడు.
ఈసారి ఐపీఎల్ కప్పును ఎగరసేకు పోతామని ధీమా వ్యక్తం చేశాడు ప్యాట్ కమిన్స్. అందరి అంచనాలు తలకిందులు చేస్తుందా అన్న అనుమానం నెలకొంది.