హస్తం వైపు పట్నం చూపు
బీఆర్ఎస్ కు బిగ్ షాక్
హైదరాబాద్ – రోజు రోజుకు బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ తగులుతోంది. ఓ వైపు రేవంత్ రెడ్డి సర్కార్ పై యుద్దం ప్రకటించిన బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన పరివారానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వన్నాడ ప్రకాశ్ గౌడ్ జంప్ అయ్యారు. ఆయనే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అంతకు ముందు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి, మాణిక్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. వీరి కలయిక సెన్సేషన్ గా మారింది.
ఆ తర్వాత కేవలం అభివృద్ధి నిధుల మంజూరు కోసం కలిశామని, పార్టీ ఆరే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మరో షాక్ తగిలింది బీఆర్ఎస్ పార్టీకి. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోక్ సభ ఎంపీగా ఉన్న వెంకటేశ్ నేత ఝలక్ ఇచ్చారు. ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మరో వైపు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో పాటు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా రేవంత్ రెడ్డితో కలుసుకున్నారు. దీంతో వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ లేక పోలేదని ప్రచారం జరుగుతోంది.