చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పట్నం కామెంట్
రంగారెడ్డి జిల్లా – త్వరలో రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి.
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సునీతా మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి సారథ్యంలో తాండూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ఓట్లు వేసేలా ప్రయత్నం చేయాలని కోరారు.
మనకు కొద్ది సమయం మాత్రమే ఉందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు పట్నం సునీతా మహేందర్ రెడ్డి. పరిగి ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి సహాయ సహకారంతో మరింత ముందుకు వెళతామని పేర్కొన్నారు.
పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులు కష్టపడాలని కోరారు పట్నం సునీతా రెడ్డి.