‘కన్నా’పై దాడి దారుణం
మాజీ మంత్రి పత్తిపాటి
గుంటూరు జిల్లా – మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణపై దాడికి పాల్పడడంపై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి దాడులు మంచి పద్దతి కాదని పలువురు పేర్కొన్నారు. సోమవారం కన్నాపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదన్నారు . దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వైసీపీ రౌడీలు , గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి రుజువైందన్నారు పత్తిపాటి పుల్లారావు. రౌడీయిజం, భౌతిక దాడులతో భయ పెట్టాలని చూస్తున్నారని దీనిని తాము ఎదుర్కొని తీరుతామని హెచ్చరించారు.
తొండపి ఘటనకు పూర్తి బాధ్యత వైసీపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుదేనని ఆరోపించారు పత్తిపాటి పుల్లారావు. అయితే రాష్ట్రంలో రోజు రోజుకు తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరాభిమానాలను చూసి తట్టుకోలేకనే వైసీపీ గూండాలు దాడులకు తెగ బడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా తాము వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు.