BUSINESSTECHNOLOGY

టెలిగ్రామ్ సిఈవో పావెల్ దురోవ్ అరెస్ట్

Share it with your family & friends

పారిస్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఫ్రాన్స్ – ప్ర‌ముఖ సంస్థ టెలిగ్రామ్ ఫౌండ‌ర్ , సీఈవో పావెల్ దురోవ్ ను అరెస్ట్ చేశారు. ఫ్రాన‌న్స్ రాజ‌ధాని పారిస్ లో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. అజర్‌బైజాన్ నుంచి లే బోర్గట్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు.

టెలిగ్రామ్​లో మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పిల్లలపై నేరాలు, పెడోఫిలిక్ కంటెంట్‌, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

దీంతో గతంలో అరెస్టు వారెంట్‌ జారీ చేసిన అధికారులు, తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటి నుంచి దురోవ ప్రాన్స్, యూరప్​లోని దేశాల్లో పర్యటించలేదు. తాజాగా లే బోర్గట్‌ వచ్చిన పావెల్‌ దురోవ్‌ను అరెస్ట్ చేసినట్లు మాస్కో టైమ్స్ పేర్కొంది.

టెలిగ్రామ్ యాప్​ వ్యవస్థాపకుడు దురోవ్ రష్యాలో జన్మించారు. ప్రస్తుతం అయన దుబాయ్​లో ఉంటున్నారు. VKontakte యాప్​న​కు సంబంధించి వినియోగదారుల డేటాను రష్యాలో భద్రతా అధికారులతో పంచుకోవడానికి నిరాకరించారు.

దీంతో అక్కడి ప్రభుత్వంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత టెలిగ్రామ్​నూ అడ్డుకునేందుకు రష్యా ప్రభుత్వం విఫలయత్నం చేసింది. దీంతో దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టారు.

2021 ఆగస్టులో ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ, పావెల్‌ దురోవ్‌ పారిస్‌కు రావడంపై విచారణ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పావెల్‌ను ఇవాళ‌ న్యాయస్థానంలో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.