నా ప్రస్థానం ధర్మం కోసం – పవన్ కళ్యాణ్
సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి
తిరుపతి – శ్రీవారిని దర్శించుకుని తన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు తిరుమలకు బయలుదేరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల.
రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన అలిపిరి చేరుకుంటారు. అలిపిరి నుండి కాలినడకన తిరుమల కొండ ఎక్కుతారు కొణిదెల పవన్ కళ్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. తిరుమలకు బయలు దేరే కంటే ముందు డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. దేశం కోసం, ధర్మం కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
ఇవాళ హిందూ మతం గొప్పదనం అంటే ఏమిటో తెలియ చెప్పేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం భావ్యం కాదన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అయ్యిందా లేదా అన్న దానిపై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.