అక్టోబర్ 2న తిరుమలలో పవన్ దీక్ష విరమణ
అలిపిరి మెట్ల మార్గం ద్వారా పుణ్య క్షేత్రానికి
అమరావతి – తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న దానిని నిరసిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా మంగళవారం బెజవాడ లోని దుర్గమ్మ మెట్లను శుభ్రం చేశారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష తిరుమలలో విరమిస్తారని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా వివరాలు తెలిపింది. అక్టోబర్ 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు ఉప ముఖ్యమంత్రి తిరుమలకు చేరుకుంటారని పేర్కొంది.
అంతే కాకుండా 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకుంటారని, అక్కడే ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారని వెల్లడించింది. దీక్ష విరమించిన అనంతరం అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో పాల్గొని ప్రసంగిస్తారని స్పష్టం చేసింది.
కాగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష మంగళవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది.