జనసేనకే రాజమండ్రి రూరల్ టికెట్
కన్ ఫర్మ్ చేసిన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. నువ్వా నేనా అనే రీతిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆయా నియోజకవర్గాలలో ఇంకా టికెట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు.
కొన్ని నియోజకవర్గాలలో భారీ ఎత్తున పోటీ నెలకొంది. ఈ సమయంలో ప్రధానంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నిన్నటి దాకా టీడీపీ ఆశించింది. పెద్ద ఎత్తున పోటీ పడ్డారు అభ్యర్థులు. దీంతో మంగళవారం జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజమండ్రి రూరల్ అభ్యర్థిని ఆయనే స్వయంగా ప్రకటించడం విశేషం.
ఈ మేరకు టీడీపీ చివరి దాకా తమకు కావాలని పట్టు పట్టింది. దీంతో ఉన్నట్టుండి కోలుకోలేని షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. రాజమండ్రి రూరల్ టికెట్ ను జనసేనకే ఖరారు చేశారు. తమ పార్టీ తరపున అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్.
అయితే ఇంకా రాజనగరం నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి టికెట్ కేటాయిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.