జన సైనికులకు రూ. 3.5 కోట్లు
ప్రకటించిన పవన్ కళ్యాణ్
అమరావతి – రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ కోసం పని చేస్తున్న జన సైనికులకు తీపి కబురు చెప్పారు. జన సైనికులు, వీర మహిళల భద్రత కోసం రూ. 3.5 కోట్లు ఇస్తానని వెల్లడించారు.
జన సైనికులే జన సేన పార్టీకి మూలమని, మీరు లేక పోతే పార్టీ లేదన్నారు పవన్ కళ్యాణ్. పార్టీని మరింత ముందుకు తీసుకు పోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉందన్నారు. ఇక నుంచి పార్టీ పరంగా ఎవరిని ఎంపిక చేసినా , ఆ అభ్యర్థులు గెలుపొందేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.
ఉన్నది మనకు తక్కువ సమయమని, కేవలం 2 నెలల్లో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లను పొందాలని కోరారు. తాను విస్తృతంగా పర్యటిస్తానని, ఎవరికి ఏ ఆపద వచ్చినా లేదా ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.