NEWSNATIONAL

శివ‌సేన‌..జ‌న‌సేన రెండూ ఒక్క‌టే

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ఏపీ డిప్యూటీ సీఎం

మ‌హారాష్ట్ర – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌నాత‌న ధ‌ర్మం కోసం తాను పోరాడుతాన‌ని ప్ర‌క‌టించారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఆయ‌న ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు.

బ‌ల్లార్పూర్ లో జ‌రిగిన స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగించారు. బల్లార్పూర్ ఒక మినీ భారతదేశం అన్నారు. ఇక్కడ అన్ని భాషలూ, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారని చెప్పారు. మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతర ఈ నేలపై జరుగుతుందన్నారు.

అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మంపై దాడి జరిగితే కచ్చితంగా బయటకు వస్తాను, పొరాడుతానంటూ ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉంద‌న్నారు. ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇంకొకరు హిందూ హృదయ్ సామ్రాట్ బాలసాహెబ్ ఠాక్రే అంటూ కొనియాడారు.

దారి పొడవునా వస్తుంటే హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ మొత్తం హైవేలు నిర్మించారని, నిర్మించడానికి రోడ్లు ఏమీ లేవు అంటూ ముంగటివర్ చెప్పారని ఇది ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ప్రగతికి నిద‌ర్శ‌నం అన్నారు. శివ‌సేన , జ‌న‌సేన రెండూ స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం ప‌ని చేసే పార్టీలంటూ ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.