పల్లె పండుగ జనం నిండుగ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమానికి సోమవారం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పల్లె పండుగ కోసం జనం భారీ ఎత్తున తరలి వచ్చారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు పవన్ కళ్యాణ్ కొణిదెల. ఈ కార్యక్రమంలో అక్టోబర్ 20 వరకు జరుగుతుందని చెప్పారు. ఏడు రోజుల పాటు గత ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలలో చేసిన తీర్మానాల మేరకు నిర్దేశించిన పనులను చేపడతామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,500 కోట్ల విలువైన 30 వేల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్ కొణిదెల. 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు .