DEVOTIONAL

ఆల‌యాల అపవిత్ర‌త‌పై ఆందోళ‌న – ప‌వ‌న్

Share it with your family & friends

ధ‌ర్మం కోసం దేశం కోసం నా ప్ర‌స్థానం

తిరుప‌తి – ప్రాయ‌శ్చిత దీక్ష చేప‌ట్టిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చాలా ఆల‌యాలు నిరాద‌ర‌ణ‌కు గురైన‌ట్లు ఆవేద‌న చెందారు. మెట్ల మార్గంలో శ్రీ‌వారిని చేరుకునేందుకు త‌న న‌డ‌క‌ను ప్రారంభించారు. అంత‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

దేశం కోసం ధ‌ర్మం కోసం తాను ఈ దీక్ష చేప‌ట్టాన‌ని అన్నారు. అయితే ఎందుకో తన స్వ‌రాన్ని మార్చిన‌ట్లు అనిపించింది. సుప్రీంకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసింది. దేవుళ్ల‌ను రాజ‌కీయాల లోకి లాగ వ‌ద్ద‌ని సూచించింది. దీనిపై తాను ఏమీ స్పందించ‌న‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

గత 5-6 ఏళ్లుగా నిత్యం ఏదో ఒక అపవిత్రం జరుగుతోందన్నారు. దాదాపు 219 ఆలయాలను అపవిత్రం చేశారని ఆరోపించారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం విధ్వంసం చేసినా ప‌ట్టించు కోలేద‌ని మండిప‌డ్డారు డిప్యూటీ సీఎం.

ఇది కేవలం ఒక ప్రసాదం గురించి కాదు…సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ని ముందుకు తీసుకెళ్లాలనే నిబద్ధత ఈ ‘ప్రాయశ్చిత్ దీక్ష అని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌.