ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు
వెలగపూడి : ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకొని నిలబడ్డామని చెప్పారు.
సోమవారం అమరావతి లోని సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆట బొమ్మలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలన ఎలా ఉండకూడదో చూపించారంటూ మాజీ సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు . పైలెట్ ప్రాజెక్టుగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని స్పస్టం చేశారు డిప్యూటీ సీఎం.
ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అంద చేస్తామని , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు కావాలన్నా, లబ్దిదారులకు చివరి దాకా చేరాలంటే కలెక్టర్లపైనే బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.