Sunday, April 20, 2025
HomeNEWSANDHRA PRADESHఓజీ వ‌ద్దు శ్రీ‌శ్రీ అనండి

ఓజీ వ‌ద్దు శ్రీ‌శ్రీ అనండి


ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్

విజ‌య‌వాడ – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమా ఓజీ గురించి ప్ర‌స్తావించారు. పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న ఆయ‌న ప్ర‌సంగిస్తుండ‌గా అభిమానులు ఓజీ అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఓజీ అనొద్ద‌ని శ్రీ‌శ్రీ అని పిల‌వాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌పంచాన్ని మార్చే శ‌క్తి ఆయుధాల కంటే పుస్త‌కాల‌కు ఎక్కువ ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు చ‌ద‌వ‌డం అల‌వాటుగా మార్చుకోవాల‌ని కోరారు .

ఫ్యాన్స్ అభిమానానికి తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని, కానీ నేను మిమ్మ‌ల్ని కోరేది ఒక్క‌టే సినిమాల‌ను చూడండి..కానీ పుస్త‌కాల‌ను చ‌ద‌వ‌డం మాత్రం మానుకోవ‌ద్దంటూ సూచించారు. నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే ప్ర‌ధాన కార‌ణం పుస్త‌కాలేన‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

యూత్ అంతా పుస్తక పఠనం అలవాటు చేసుకోండి.. పుస్తకం ద్వారా వచ్చే శక్తి, జ్ఞానం వేరు.. చీకటిలో ఉనప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది.. చేతిలో పుస్తకం ఉంటే ఆ ధైర్యమే వేరు.. తొలిప్రేమ సినిమాలో వచ్చిన రూ.15 లక్షల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొనుకున్నాన‌ని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments