ఓం నమో నారాయణాయను జపించండి
పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – తిరుపతి లడ్డూ కల్తీ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిని నిరసిస్తూ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు జనసేన పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల. తాజాగా సనాతన పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పూజించే శ్రీ వేంకటేశ్వర స్వామికి పవిత్రమైన “లడ్డూ మహా ప్రసాదం” జంతువుల కొవ్వు , చేప నూనెతో కల్తీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు.
ఈ ఘోర తప్పిదానికి ప్రతిస్పందనగా, ఇచ్చిన డిజైన్‌లో మీ ఛాయాచిత్రాన్ని ఉంచి, “ఓం నమో నారాయణాయ” అనే పవిత్ర మంత్రాన్ని జపించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను ఈ ప్రచారంలో చేరాలని కోరారు పవన్ కళ్యాణ్.
ప్రాయశ్చిత్తం చేసే చర్యగా భక్తులందరూ వెంకటేశ్వర స్వామిని క్షమించమని, ఇదే సమయంలో మన ఆలయ సంప్రదాయాలు, సనాతన ధర్మం పవిత్రతను కాపాడు కోవాలని కోరారు.