ఆక్రమించుకున్న భూములపై విచారణ
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిగ్ షాక్ ఇచ్చారు. మాజీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సీనియర్ లీడర్ సజ్జల రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న భూములపై విచారణకు ఆదేశించారు. సీకే దిన్నె రెవిన్యూ పరిధిలోని 1599, 1600/1, 2, 1601/1, 12, 255 పాటు ఇతర సర్వే నెంబర్లలోని 42 ఎకరాల అటవీ శాఖకు చెందిన భూములు ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని కడప కలెక్టర్ కు స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అధికారాన్ని అడ్డం పెట్టుకుని సజ్జల రామ కృష్ణా రెడ్డి పలు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో తను రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంపై కూటమి సర్కార్ సీరియస్ అయ్యింది.
జగన్ రెడ్డి పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో చోటు చేసుకున్న అన్ని పనులపై , కార్యకలాపాలపై, వ్యవహారాలకు సంబంధించి విచారణకు ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇదే సమయంలో అటవీ శాఖ చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు సజ్జల నిర్వాకంపై.