విరాళాలు ఇస్తే సీట్లు ఇవ్వం
స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
మంగళగిరి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. దీంతో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు దూకుడు పెంచారు. టికెట్ల కోసం ఆశావహులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది.
సీట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. బాబు, పవన్ లు పలుమార్లు చర్చలు జరిపారు. ఇవాళో లేదా రేపో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజాగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు ఆశావహులు జనసేన పార్టీ నుంచి పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారు. జనసేన పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో విరాళాలు ఇచ్చిన వారంతా టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ విషయం బయటకు పొక్కడంతో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఎవరైతే విరాళాలు ఇచ్చారో వారికి తిరిగి చెక్కులను పంపించాలని ఆదేశించారు. దీంతో ఖంగుతిన్నారు ఆశావహులు.