రేపే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే
నటుడి నుంచి రాజకీయ నాయకుడి దాకా
హైదరాబాద్ – పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన పూర్తి పేరు కొణిదల పవన్ కళ్యాణ్.
కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అరుదైన నటుడు పవన్ కళ్యాణ్. ఆయన దమ్మున్నోడు..అంతకు మించి పవర్ ఉన్నోడు. ఒకరకంగా చెప్పాలంటే బుల్లెట్ లాంటోడు. పవర్ ఫుల్ డైలాగులకు పెట్టింది పేరు. నాకో తిక్కుంది దానికో లెక్కుంది అంటూ పవన్ కళ్యాణ్ చేత అనిపించిన దర్శకుడు హరీశ్ శంకర్ కు థ్యాంక్స్ చెప్పక తప్పదు.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. ఆయన 1971లో పుట్టారు. పేరుకు నటుడైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే చాలు చలించి పోయే మనస్తత్వం కలిగిన వ్యక్తిత్వం ఆయనది. ఎవరూ ఊహించని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను మార్పునకు లోనయ్యారు పవన్ కళ్యాణ్. తన సోదరుడు చిరంజీవి రాజకీయాలలో ఉన్నప్పటికీ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు పవర్ స్టార్.
పరోపకారిగా పేరు పొందారు. తన జీవిత కాలంలో ఏది అనుకున్నాడంటే దానిని సాధించేంత దాకా నిద్ర పోని మనస్తత్వం పవన్ కళ్యాణ్ ది. అందుకే ఆయనకు అభిమానులు ఎక్కువ. ఆయనంటే పడి చస్తారు. ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేంత ప్రేమ వారిది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పని చేస్తున్నారు. రాజకీయాలలో పెను సంచలనానికి నాంది పలికారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బుల్లెట్ లాంటోడు.