పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్
పవర్ ప్యాక్డ్ ఫైర్ సెలబ్రేషన్స్
హైదరాబాద్ – ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2. సోమవారం భారీ ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు యావత్ పవన్ ఫ్యాన్స్ సిద్దమై పోయారు. ఓ వైపు వరదలు ముంచెత్తినా మరో వైపు ఇబ్బందులు ఎదురైనా సరే తమ అభిమాన దేవుడిగా ఆరాధించే పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు జీవించాలని, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుతున్నారు.
ఇంకా కొద్ది గంటలు ఉండగానే సెలబ్రేషన్స్ కు శ్రీకారం చుట్టారు. ఓవర్సీస్ లో కూడా పవన్ కళ్యాణ్ మేనియా కొనసాగుతోంది. తను నటించిన గబ్బర్ సింగ్ ను రీ రిలీజ్ చేశారు దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత బండ్ల గణేశ్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఇద్దరు. పవన్ సినీ కెరీర్ లో గబ్బర్ సింగ్ మోస్ట్ పాపులర్ మూవీగా నిలిచి పోయిందని దర్శకుడు పేర్కొంటే..పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే కాదని తనకు దైవ సమానమని కొనియాడారు నిర్మాత గణేశ్.
ఇదిలా ఉండగా డీవీవీ ఎంటర్ టైన్మెంట్ కీలక ప్రకటన చేసింది. ఓజీ అనేది సినిమా మాత్రమే కాదు ఇది అందరికీ చెందిన వేడుక అంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పేర్కొంది. తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన డిఫరెంట్ లుక్ తో కూడిన పోస్టర్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఫస్ట్ సింగల్ పుట్టిన రోజు సందర్బంగా ప్రకటిస్తామని తెలిపింది.