అన్నయ్య ఆపద్బాంధవుడు – పవన్
మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు , మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కొణిదెల చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విసెష్ తెలిపారు.
గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు పవన్ కళ్యాణ్. తనకు చిరంజీవి సోదరుడు మాత్రమే కాదని గురువు, దైవం కూడా అని కొనియాడారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆపద్బాంధవుడు మాత్రమే కాదని కనిపించే దేవుడు అని ప్రశంసలు కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం.
అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన ఆపన్న హస్తం అందించారని కొనియాడారు పవన్ కళ్యాణ్. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణ దానం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు.
కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలి పోయాయని పేర్కొన్నారు. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారని ప్రశంసించారు. ఆ గుణమే చిరంజీవి అన్నయ్యను సుగుణ సంపన్నునిగా చేసిందని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందు కోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా చిరంజీవి ఆశీర్వదించిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు.