NEWSANDHRA PRADESH

ప‌ద‌వుల‌కు వ‌న్నె తెచ్చిన అయ్య‌న్న

Share it with your family & friends

ప్ర‌శంస‌లు కురిపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శంస‌లు కురిపించారు. శ‌నివారం అసెంబ్లీలో నూత‌న స్పీక‌ర్ గా ఎన్నికైన న‌ర్సింప‌ట్నం ఎమ్మెల్యే చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడును అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న‌పై క‌విత్వం కూడా వినిపించారు.

వ్య‌క్తిగ‌త దూష‌ణల‌కు, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు తావు లేకుండా స‌భ‌ను న‌డిపిస్తార‌ని, మీ రాజ‌కీయ అనుభ‌వం అసెంబ్లీకి ప‌నికి వ‌స్తుంద‌ని , త‌న‌కు ఆ న‌మ్మ‌కం కూడా ఉంద‌న్నారు. నాలుగు సార్లు మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా , ఒక‌సారి ఎంపీగా అనేక ర‌క‌మైన ఉన్న‌త ప‌ద‌వులు నిర్వ‌హించార‌ని తెలిపారు.

అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంద‌న్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న. అని ప్ర‌శంసించారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.

గ‌తంలో ఉన్న ప్ర‌భుత్వంలా కాకుండా ఇప్పుడు ఉన్న కూట‌మి స‌ర్కార్ ను ఆద‌ర్శ ప్రాయంగా ఉండేలా చేస్తార‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.