కాకినాడ నుంచి పవన్ పోటీ
ప్రకటించిన జనసేనాని
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చింది. గత కొంత కాలంగా ఆయన ఎక్కడి నుంచి బరిలో ఉంటారనే దానిపై విస్తృతంగా చర్చ జరిగింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని బలంగా వాదం వినిపించింది. చివరకు ఎక్కడి నుంచి పోటీ చేస్తామనే దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది జనసేన పార్టీ .
ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి లోక్ సభ స్థానానికి ఎంపీగా బరిలో ఉంటారని ప్రకటించింది. ఇప్పటికే ఈసారి జరగబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు జన సేన, భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఈసారి మూడు పార్టీలు ఒకే వేదికను పంచుకోనున్నాయి.
గతంలో కాంగ్రెస్ పార్టీ తో ఒప్పందం చేసుకున్న చంద్రబాబు ఉన్నట్టుండి రూట్ మార్చారు. ప్రస్తుతం మోదీ సారథ్యంలోని కూటమిలోకి జంప్ అయ్యారు. కేవలం తన ప్రయోజనాల కోసమే పొత్తు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా జనసేన పార్టీని కలుపుకోక పోతే టీడీపీకి ఆశించిన సీట్లు రావని సర్వేలు చెబుతున్నాయి.