DEVOTIONAL

డిక్ల‌రేష‌న్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురు

Share it with your family & friends

మైన‌ర్ కావ‌డంతో డిప్యూటీ సీఎం సంత‌కం

తిరుమ‌ల – తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శనానికి సంబంధించి అన్య మ‌త‌స్తులు ఎవ‌రైనా ద‌ర్శించుకుంటే ముందుగా డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప‌త్రాలపై సంత‌కాలు చేయాలి. ఇప్ప‌టికే డిక్ల‌రేష‌న్ వివాదంతో పాటు తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ జ‌రిగింద‌నే దానిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది.

ఇదిలా ఉండ‌గా ల‌డ్డూ క‌ల్తీ జ‌రిగింద‌ని, దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు. అంతే కాదు 11 రోజుల పాటు ప్రాయ‌శ్చిత్త దీక్ష చేప‌ట్టారు. బుధ‌వారం ఆయ‌న తిరుప‌తి లోని శ్రీ‌వారి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమ‌ల కొండ పైకి చేరుకున్నారు.

ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతుళ్లు కూడా ఆయ‌న‌తో పాటు స్వామి వారి ద‌ర్శ‌నానికి విచ్చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న కూతురు ప‌లీనా అంజ‌నీ కొణిదెల తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి సంబంధించి డిక్ల‌రేష‌న్ ఇచ్చారు.

టీటీడీ ఉద్యోగులు తీసుకు వ‌చ్చిన డిక్ల‌రేష‌న్ ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. ఇదిలా ఉండ‌గా ప‌లీనా అంజ‌ని కొణిదెల మైన‌ర్ కావ‌డంతో తండ్రిగా డిప్యూటీ సీఎం పవ‌న్ క‌ళ్యాణ్ ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు.