పవన్ కళ్యాణ్ సాయం భారీ విరాళం
గ్రామ పంచాయతీలకు సైతం మద్దతు
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా బాధితులకు మద్దతుగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
ఇదిలా ఉండగా ఏపీ సీఎం నిధికి తన వంతుగా రూ. కోటి విరాళంగా ప్రకటించారు. బుధవారం మరో సంచలన ప్రకటన చేశారు కొణిదెల పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రభుత్వానికి తీపి కబురు చెప్పారు. వరదల కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్నందున తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి విరాళం ఇస్తున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా ఏపీలోని 400 గ్రామ పంచాయతీలు వరద బారిన పడ్డాయని తెలిపారు డిప్యూటీ సీఎం. ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు . మొత్తం రూ. 4 కోట్ల రూపాయలను నేరుగా ఆయా పంచాయతీల ఖాతాలలో జమ చేస్తానని చెప్పారు.
అటు ఏపీ సీఎం నిధికి రూ. కోటి ప్రకటించగా తెలంగాణ సీఎం నిధికి మరో కోటి విరాళంగా ఇవ్వడం విశేషం.