హిందువుల ఆందోళన పవన్ ఆవేదన
మైనార్టీలకు రక్షణ కల్పించాలని డిమాండ్
అమరావతి – బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఘటనలపై తీవ్రంగా స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల. ఆయన సోమవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి గత కొన్ని రోజుల నుంచి ప్రధానంగా హిందువులు, మైనార్టీలపై పనిగట్టుకుని దాడులకు దిగడం పట్ల ఆవేదన చెందారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంటుందని, మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత మధ్యంతర ప్రభుత్వంపై ఉందన్నారు. భారత ప్రభుత్వం అక్కడ శాంతి నెలకొల్పేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు డిప్యూటీ సీఎం.
బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ (CPB) నాయకుడు ప్రదీప్ భౌమిక్‌ను పట్ట పగలు దారుణంగా దాడి చేయడం, హిందూ దేవాలయాలైన ఇస్కాన్ , కాళీ మాతలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ప్రధానంగా హిందువులు, మైనార్టీలు, క్రైస్తవులు, బౌద్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు పవన్ కళ్యాణ్ కొణిదెల.
దేశంలోని మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందని స్పష్టం చేశారు.