కృష్ణ తేజకు పవన్ కళ్యాణ్ కంగ్రాట్స్
బాలల హక్కుల కమిషన్ పురస్కారం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎం.వి.ఆర్. కృష్ణ తేజను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు. ఆయనకు జాతీయ స్థాయిలో అత్యున్నతమైన పురస్కారం లభించింది. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం ప్రశంసించారు. ఇలాంటి అధికారులు రాష్ట్రానికి కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో అవార్డును ప్రకటించారు ఐఏఎస్ ఆఫీసర్ ఎం.వి.ఆర్ కృష్ణ తేజ. ఇదిలా ఉండగా కృష్ణ తేజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఆయన ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తన విధి నిర్వహణలో ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. ఆ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించారు.
కరోనా కష్ట కాలంలో, కేరళ వరదల విపత్తు సమయంలో కృష్ణ తేజ విధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని ఆ రాష్ట్ర ప్రజలు మరచి పోలేదని ప్రశంసించారు.