మహోన్నత మానవుడు పింగళి వెంకయ్య
ఘనంగా నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్
అమరావతి – తెలుగు జాతి మరిచి పోలేని మహాను భావుడు పింగళి వెంకయ్య అని ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల. శుక్రవారం పింగళి వెంకయ్య జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం.
పింగళి వెంకయ్య అందించిన స్ఫూర్తిని జాతి మరిచి పోదని అన్నారు పవన్ కళ్యాణ్.. మన దేశానికి జాతీయ పతాకాన్ని అందించి… నిత్య స్ఫూర్తిని రగిలించిన గొప్ప , అరుదైన వ్యక్తి దివంగత పింగళి వెంకయ్య అని అన్నారు .
భరత జాతి ఉన్నంత వరకు, సూర్య చంద్రులు ఉన్నంత దాకా జాతీయ పతాకం ఉంటుందని, పతాకం ఉన్నంత వరకు పింగళి వెంకయ్య జీవించి ఉంటారని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదెల. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక గుర్తింపు ఉండాలనే తపనతో ఆయన మువ్వన్నెలతో పతాకాన్ని తీర్చిదిద్దారని అన్నారు డిప్యూటీ సీఎం.