నటుడి నుంచి రాజకీయ ప్రస్థానం దాకా
అమరావతి – పవన్ కళ్యాణ్ వెరీ స్పెషల్ . ఆయన పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు సంబురాలలో మునిగి పోయారు. తమ ఆరాధ్య దైవంగా భావించే పవర్ స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నటుడిగా భిన్నమైన పాత్రలు చేశాడు. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు.
పార్టీ పెట్టాడు. తొలుత ఇబ్బంది పడ్డాడు. అయినా వెనక్కి తగ్గలేదు. పోరాటం చేశాడు. వారాహి యాత్ర చేపట్టాడు. వైసీపీ సర్కార్ గుండెల్లో నిద్ర పోయాడు. ఏపీలో జనసేన పార్టీని పవర్ ఫుల్ గా తీర్చి దిద్దడంలో సక్సెస్ అయ్యాడు. 21 అసెంబ్లీ సీట్లు 2 ఎంపీ సీట్లను గెలుపొంది అన్ని పార్టీలను విస్తు పోయేలా చేశాడు.
ఏపీలో కీలకమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్. ఏకంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెప్పు పొందాడు. పవన్ కళ్యాణ్ మామూలోడు కాదని తుఫాన్ అంటూ ప్రశంసలు కురిపించారు. దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాడు.
2024 సంవత్సరంలో కూటమి సర్కార్ లో ముఖ్య భూమిక పోషించడమే కాదు సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత డిప్యూటీ సీఎంగా కొలువు తీరాడు. అనుకున్నది సాధించాడు. తనకు ఎదురే లేదని చాటాడు.