ఉప్పాడ సముద్రపు కోతపై దృష్టి పెట్టండి
ఆదేశించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం ఉప్పాడ ను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూ
పాలని ఆదేశించారు.
సమస్యకు శాస్త్రీయ పరిష్కారం వెతకేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మారిటైం బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వశాఖ అధికారులతో కలసి తీర ప్రాంతంలో పర్యటించారు.
అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవెర్చే పనిని మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యచరణకు దిగారు.
సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు.