వెన్ను చూపని నైజం పవనిజం
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన స్టార్
అమరావతి – పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఫ్యాన్స్ ఊగి పోతారు. అంతలా ఆయన అల్లుకు పోయారు. ఆక్టోపస్ లా విస్తరించిన జగన్ మోహన్ రెడ్డికి చుక్కలు చూపించాడు పవన్ కళ్యాణ్. తనపై ఎన్ని ఆరోపణలు చేసినా, విమర్శలు గుప్పించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తట్టుకుని నిలబడ్డాడు. తనకు ఎదురే లేదని చాటాడు.
చెప్పి మరీ తనను పవర్ లోకి రాకుండా చేశాడు. ఏకంగా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతే కాదు అటు శాసన సభ ఎన్నికల్లో ఇటు లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీకి జీవం పోయడమే కాదు ఏకంగా 21 ఎమ్మెల్యే సీట్లను 2 లోక్ సభ స్థానాలను నిలిచిన అన్ని చోట్లా గెలిపించుకున్న ఏకైక నాయకుడిగా చరిత్ర సృష్టించాడు పవర్ స్టార్.
150కి పైగా స్థానాలను కలిగిన వైఎస్సార్సీపీకి చుక్కలు చూపించాడు. కేవలం 11 సీట్లకే పరిమితం చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇటు టీడీపీని అటు బీజేపీకి మధ్య వారధిగా ఉంటూ కూటమిని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యాడు.
పాలిటిక్స్ కు పనికి రాడని విమర్శలు చేసిన వాళ్ల నోళ్లు మూయించాడు. ఇప్పుడు ఏకంగా ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా అయ్యాడు. తనదైన రీతిలో పాలనా పరంగా ముద్ర వేస్తున్నాడు పవన్ కళ్యాణ్.